TEJA NEWS

హైదరాబాద్ మేడ్చల్ జిల్లా లో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో శిక్షణలో ఉన్న విమాన పైల ట్ శ్రీకరన్ రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.

కారులో ఉన్న శ్రీకారన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలు స్తుంది.యాక్సిడెంట్ పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు.

మృతుడు శ్రీకరన్ రెడ్డి స్వస్థ లం గజ్వేల్ వాసిగా గుర్తిం చారు. నేరెడ్ మీట్ ప్రాంతం లో కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. బ్యాంకాక్ లో శిక్షణ పొందుతున్న పైలట్ శ్రీకారన్ రెడ్డి, గత వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చాడు.

యాదగిరిగుట్ట కు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పిఇవ్వాళ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయలుదేరాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..విమాన పైలట్ మృతి

TEJA NEWS