TEJA NEWS

మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, మంగళవారం మైదంబండ గ్రామస్తులు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను కలిసి వినతి పత్రం అందజేశారు.

గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లాలన్న విద్యార్థులు స్కూళ్లకు కాలేజీలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించా లని,మంత్రి శ్రీధర్ బాబును కోరారు. వెంటనే స్పందిం చిన మంత్రి శ్రీధర్ బాబు, గోదావరిఖని డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిం చారు.

ఈ కార్యక్రమంలో ముత్తారం మండల మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బియ్యని శివకుమార్, మైదంబండ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బూడిది శ్రీనివాస్, రాజబాబు, మహేందర్, రాజేందర్, రాము, పాల్గొన్నారు


TEJA NEWS