ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్: నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్

ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్: నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్

TEJA NEWS

శాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మోకిల పోలీసులు కవాతు నిర్వహించారు. నార్సింగి ఏసీపీ వెంకటరమణ గౌడ్, మోకిల సిఐ వీరబాబు గౌడ్, డిఐ నాగరాజు ల ఆధ్వర్యంలో మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ, ప్రొద్దుటూరు, టంగుటూరు, మోకిల, కొండకల్ గ్రామాలలో సాయుధ బలగాలతో కలిసి పోలీస్ అధికారులు గ్రామాలలో తిరుగుతూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ వెంకటరమణ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, దానికి పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సై కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS