గుడుంబా స్టావారాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్టావారాలపై పోలీసుల దాడులు

TEJA NEWS

Police raids on Gudumba stawaras

గుడుంబా స్టావారాలపై పోలీసుల దాడులు …

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాలమేరకు
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్టావారాలపై పోలీసుల దాడులు

మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబా సావరాలపై దాడులు నిర్వహించారు.మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ నుండి అధికారులు సిబ్బంది కలసి గుడుంబా స్టావారాలపై దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో 12 కేసులు నమోదు చేయడం జరిగింది.అలాగే 57200/- రూపాయల విలువ చేసే 143 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, 1930 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా జరిపిన ఈ దాడులలో అధికారులు మరియు సిబ్బంది కలిపి 70 పోలీసులు మంది పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా లో గుడుంబా స్తావరాలకు చోటు లేదన్నారు.
ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మహమ్మారిలాంటి గుడుంబాకు అలవాటు పడి ఎంతోమంది కుటుంబాలను చిన్నబిన్నం చేసుకొని చివరకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.
అంతే కాకుండా మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తునట్టు తెలిసిన అమ్మిన వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గొప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఇక పై గుడుంబా రహిత జిల్లా గా మానుకోట ఉండబోతుందని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ప్రకటన లో తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి