ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
న్యూ ఢిల్లీ :
ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు.
ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పంజాబ్, హర్యానా సరిహద్దు శింభూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
రహదారి పొడవునా పోలీసులను మొహరిం చారు. పరిస్థితిని అదుపు లోకి తీసుకురావడం కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.