TEJA NEWS

రోడ్డెక్కిన పోలీస్ భార్యలు

వరంగల్ జిల్లా :
శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల జీవితాలకు, రాజకీయ నాయకుల ఆస్తులకు, రక్షణ కల్పిస్తున్న పోలీసు భార్యలు రోడ్డెక్కారు.

వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదన వ్య‌క్తం చేశాయి. కానిస్టే బుళ్లను వెట్టిసాకిరి చేపిస్తూ,కనీసం సెలవులు కూడ ఇవ్వకుండా. కుటుంబానికి దూరం చేస్తున్నారని పోలీస్ భార్యలు కన్నీరు మున్నీ రుగా విలపిస్తున్నారు.

అధికారులు తమ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌ రించాల‌ని కానిస్టేబుళ్ల‌ భార్యలు ఈరోజు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.నిరసనను ఆపేందుకు ఆర్ టీ ఓ ఆఫీస్ నుండి మామునూరు బెటాలియన్ వరకు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

రిజర్వ్డ్ పోలీసుల బాధ లను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి,ని కోరారు.. కొత్త డీజీ రావడం తోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పోలీసుల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


TEJA NEWS