డిసెంబర్ 2న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణం భవన సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నేపథ్యంలో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,పోలీస్ ఉన్నత అధికారులతో కలిసి బాచుపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ విశ్వవిద్యాలయం, పోలీస్ అధికారులతో ఏర్పాట్ల గురించి చర్చించి,అనంతరం సభ స్థలం,పార్కింగ్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది.ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఎన్ఎంసి,మరియు పోలీస్ అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎసిపి శ్రీనివాసరావు, సీఐ ఉపేందర్,తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు వెలుదండ నిత్యానందరావు,రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు,ఇతర ముఖ్య అధికారులు,ఎన్ఎంసి అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 2న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…