సంక్షోభం నుంచి సాధికారత దిశగా.. ఆర్థిక, విద్యుత్ రంగాలు
▪️ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్
▪️ అవసరాల అంచనాలతో తీసుకున్న నిర్ణయాలు
▪️ విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిపిన వైనం
▪️ శాఖల పనితీరులోనూ, పాలనపైనా..
▪️ తిరుగలేని ముద్ర వేస్తున్న ఉప ముఖ్యమంత్రి
నాయకుడికి ముందు చూపు ఉండాలి.. భవిష్యత్ అవసరాలు.. అంచనాలపై ఖచ్చితమైన అవగాహన ఉండాలి.. అప్పుడే ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించగలదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ ఇప్పుడు ఏర్పడింది.. అయినా కోతల్లేకుండా ప్రజలకు విద్యుత్ అందిస్తోంది ప్రభుత్వం. అందుకు ప్రధాన కారణం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయాలే అని చెప్పక తప్పదు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొలువు తీరాక.. వెంటనే ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖలకు సారథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఆయా రంగాలకు చెందిన అధికారులు నిపుణులతో తొలినెల రోజుల పాటు ప్రత్యేకంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. రాబోయో రోజుల్లో విద్యుత్ డిమాండ్ ఎలా ఉంటుంది? వేసవి రోజుల్లో ఈ డిమాండ్ ఏమేరకు పెరుగుతుంది? రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం, విద్యుత్ కొనుగోలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ఫలితాలే ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి.
గత ఏడాది ఇదే ఏప్రిల్ చివరివారంలో రాష్ట్ర విద్యుత్ వినియోగం సరాసరి 150 ఉంచి 160 మిలియన్ యూనిట్లుగా ఉండేది. ఇప్పుడు ఈ విద్యుత్ వినియోగం 225 నుంచి 230 మిలియన్ యూనిట్లు ఉంది. రాష్ట్ర స్థాపిత విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి 100 మిలియన్ యూనిట్లు ఉంటే.. దాదాపుగా 150 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేసి ప్రజలకు పవర్ కట్స్ లేకుండా విద్యుత్ ను సరఫరా చేసేందుకు ఉప మఖ్యమంత్రి చర్యలు చేపట్టారు.
తాత్కాలిక అవసరాల కోసం విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నా.. భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు తగు నిర్ణయాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఆల్టర్నేటివ్ పవర్ తో పాటు, గ్రీన్, సోలార్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికు స్పష్టంగా చెప్పారు.
భవిష్యత్ తరాల కోసం, రేపటి అవసరాలను దృష్టిఓ పెట్టుకుని నిర్ణయాలను తీసుకునే నాయకుడిని ప్రజలు దార్శనికుడిగా చెప్పుకుంటారు. భట్టి విక్రమార్క వేస్తున్న ఈ అడుగులు.. రేపటి తెలంగాణకు ఉజ్వల వెలుగులు నింపాలని కోరుకుందాం.