
సీట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు!
హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేరు కున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో సీట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు.ఈ క్రమంలో ప్రభాకర్ రావును విచారించేందుకు సీట్ అధికారులు ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆదివారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు అయిన తన పాస్ పోర్ట్‌ను తిరిగి చెల్లుబాటు లోకి తెచ్చి దానిపై ట్రావెల్ డాక్యుమెంట్ అనుమతి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవడంతో 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు నగరానికి చేరుకున్నారు.
శంషాబాద్ విమానాశ్ర యంలో అడుగు పెట్టగానే ఆయన్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఆయన మీద లుక్ అవుట్ నోటీసు,రెడ్ కార్నర్ నోటీసులు ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.అంతకుముందు,ఈనెల 6 తేదీన ప్రభాకర్ రావుకు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఇండియన్ ఎంబసీ నుంచి అనుమ తులు వచ్చినట్లు తెలిసింది.
