స‌లార్ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ..ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ నీల్

స‌లార్ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ..ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ నీల్

TEJA NEWS

Salaar Movie : స‌లార్ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ..ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ నీల్

డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్
ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌లార్ దుమ్ము రేపుతోంది. ప్ర‌భాస్ మేనియాను కొత్త ర‌కంగా చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌భాస్ తో క‌లిసి శ్రుతీ హాస‌న్ న‌టించింది. మిగ‌తా పాత్ర‌లు ప‌క్కన పెడితే డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం వ‌సూళ్ల‌ను తిర‌గ రాస్తోంది. ఇప్ప‌టికే స‌లార్ కు పోటీగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , తాప్సీ క‌లిసి న‌టించిన డుంకీ మూవీని రిలీజ్ చేసినా అంత‌గా ప్ర‌భావం చూపించ లేక పోయింది.

ఇక భార‌తీయ సినిమాలో త‌న‌కంటూ ఎదురే లేద‌ని డార్లింగ్ ప్ర‌భాస్ మ‌రోసారి నిరూపించాడు. ఇక ప్ర‌శాంత్ నీల్ త‌న‌దైన స్టైల్ లో తీశాడు స‌లార్ మూవీని. ఇదిలా ఉండ‌గా ఏకంగా రూ. 550 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించింది ఇప్ప‌టి దాకా.

డిసెంబ‌ర్ 22న విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా కోట్లు కుమ్మ‌రించింది. తొలి రోజు రూ. 176.52 కోట్లు వ‌సూలు సాధించ‌గా 2వ రోజు రూ. 101.39 కోట్లు, 3వ రోజు రూ. 95.24 కోట్లు, 4వ రోజు రూ. 76.91 కోట్లు, 5వ రోజు రూ. 40.17 కోట్లు, 6వ రోజు రూ. 31.62 కోట్లు, 7వ రోజు రూ. 20.78 కోట్లు, 8వ రోజు రూ. 14.21 కోట్లు క‌లెక్ష‌న్స్ సాధించింది. మొత్తంగా రూ. 550 కోట్లు వ‌సూలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS