TEJA NEWS

హైదరాబాద్:మార్చి 01
మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు పేర్కొన్నారు.

గత అక్టోబర్‌లో నిజామా బాద్ పర్యటనలో ప్రధాని 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభిం చిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ పవర్‌ ప్లాంట్‌తో తెలంగాణ ప్రజల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీరనున్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు.

మార్చి 4న ప్రారంభోత్సవం కానుంది. రూ.11వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీరుతాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు.

తెలంగాణ ప్రజల విద్యుత్ సమస్యలు తీరడమే కాకుండా, రైతులకు, వాణిజ్య అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం అవుతుందని మంత్రి అన్నారు.

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు క్రింద 1,600 మెగావాట్ల(2800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను మొదటి విడత (ఫేజ్-I) లో భాగంగా, 2,400 మెగావాట్ల(3800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను రెండవ విడత (ఫేజ్-II) లో భాగంగా…

పెద్దపల్లి జిల్లా రామ గుండంలో ఏర్పాటు చేయాలని NTPC నిర్ణయం తీసుకుందని. ప్రధాని చొరవతో మొదటి విడత 1600 మెగావాట్ల విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


TEJA NEWS