
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష పలువురికి జరిమానా
సూర్యపేట జిల్లా ప్రతినిధి: మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధిస్తూ సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బి.వి రమణ తీర్పు చెప్పినట్లు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. సూర్యాపేటలో పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా ఒక్కరికి రెండు రోజుల జైలుశిక్ష మరియు జరిమానా మిగతా వారికి రూ.1500 జడ్జి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఎస్ఐ తెలిపారు మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. గత నెల రోజుల నుండి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా పట్టు బడిన వారిని కోర్టులో హాజరుపరచగా ఆరుగురికి జైలు శిక్ష జరిమానా మరియు 62 మందికి జడ్జి జరిమానా విధించినట్లు ఎస్సై సాయిరాం పేర్కొన్నారు.
