TEJA NEWS

వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నేడు నామినేషన్

హైదరాబాద్
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ, నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్‌ ఎదుట నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.


TEJA NEWS