TEJA NEWS

సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!

నాగర్ కర్నూల్ జిల్లా:
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతు న్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం లేదని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో తమకు తామే విద్యా బోధన చేసుకుంటున్నారు. రోజుకు ఒక టీచర్ చుట్టం చూపుగా వచ్చి వెళ్తుంటా రని, తమకు పాఠాలు చెప్ప కుండా తిని మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోండి అని చెప్తారని, విద్యార్థులు వాపోతున్నారు…

ఉపాధ్యాయులు సమయపాలన కూడా పాటించరని తెలిపారు. ఈరోజు ఉదయం 9:30 దాటినా ఉపాధ్యాయులు రాకపోవడంతో వారే స్కూల్ తాళం తీసి ఊడ్చుకొని ప్రార్థన చేసి క్లాసులో కూర్చున్నారు.

గ్రామస్తులు గమనించి విద్యార్థులను మందలించ డంతో విషయం వెలుగు లోకి వచ్చింది. సారోళ్లు రాకుంటే మేము ఐదుగురం స్కూల్ మానేస్తామని విద్యార్థులు చెబుతు న్నారు.

ఈ విషయం పై వెల్దండ మండల ఎంఈఓను వివరణ కోరగా.. అక్కడ ఉన్న ఉపాధ్యాయురాలు గాయత్రి మెడికల్ లీవ్ లో వెళ్ళిందని తెలిపారు.

ఆమె స్థానం ఇంచార్జ్ గా శ్రీశైలం అనే ఉపాధ్యాయు డిని నియమించాం అన్నారు. ఆయన లీవ్ లో ఉన్నారో ఏమో నాకు ఎలా తెలుస్తుందని సమాధానం చెబుతున్నాడు. విద్యాధికారి


TEJA NEWS