చివరి శ్వాసవరకు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ప్రొఫెసర్.జయశంకర్

TEJA NEWS

చివరి శ్వాసవరకు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ప్రొఫెసర్.జయశంకర్

తెలంగాణ ప్రజల నిరాశ, నిస్పృహలు దూరం చేసిన ఉద్యమ నాయకుడు కె.సి.ఆర్………. మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి

వనపర్తి :
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయములో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ పతాకం మరియు పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తన 16వ ఏటనే తెలంగాణ ప్రాధాన్యత వివరిస్తూ ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలిచారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మకద్రోహ పార్టీగా మొదటి నుండి రామ్ మనోహర్ లోహియా,జయప్రకాష్ నారాయణ, ఎన్. టి.ఆర్ పునరుద్ఘాటించారు అని వారి మార్గదర్శనములో కె.సి.ఆర్ తన శ్వాస, ధ్యాస తెలంగాణ రాష్ట్ర సాధనగా ఉద్యమం 14ఏండ్లు అహింసహితంగా ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని సాధించి ప్రజలలో నెలకొన్న నిరాశ, నిస్పృహలు దూరం చేసిన మాహా నాయకుడు కె. సి.ఆర్ అని కొనియాడారు.
జయశంకర్ ఓడవని ముచ్చట పుస్తకం కె.సి.ఆర్ స్పూర్తిగా తీసుకొని రాష్టాన్ని సాధించి 9ఏండ్లు సుపరిపాలన అందించారని అన్నారు.


రెండేండ్లలో ప్రజల తిరస్కారానికి గురైన కాంగ్రెస్.
కె.సి.ఆర్ 9ఏండ్ల సుపరిపాలన చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధ్వంస పాలన చూసి విసిగి పోయారని ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతులకు రైతు భరోసా రైతు బీమా,రైతు రుణ మాఫీ చేయకుండా యూరియా సకాలంలో పంపిణీ చేయకుండా,కరెంట్ కోతలతో సతాయించినా పంటలు పండించిన పంటలు కొనుగోలు చేయకుండా రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ ఆగం కాక తప్పదు అని అంతేకాకుండా మహిళలకు 2500,తులం బంగారం , నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు,విద్యార్థినులకు స్కూటీలు,కె.సి.ఆర్ కిట్టు,గ్యాస్ సబ్సిడీ,దళిత బంధు,బి.సి.బంధు వంటి పథకాలకు మంగళం పాడారని ఆయన దుయ్యబట్టారు.
ప్రజలు మళ్ళీ కె.సి.ఆర్ రావాలని కోరుకుంటున్నారని జయశంకర్ ఆశయాలు స్పూర్తిగా తీసుకొని కె.సి.ఆర్ అడుగుజాడలలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
బి.ఆర్. ఐఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top