కోదాడ కోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

TEJA NEWS

కోదాడ కోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ జడ్జి కే. సురేష్…

కోదాడ కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ జడ్జి కే. సురేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చట్టసభలతో పాటు న్యాయవ్యవస్థలోనూ తెలంగాణ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే. భవ్య, ఫస్ట్ ఏడీఎం జడ్జి మహమ్మద్ ఉమర్ , సెకండ్ ఏడీఎం జడ్జి జాకియా సుల్తానాలతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు నాగార్జున,వెంకట్రావు, పి. పి సిలివేరు వెంకటేశ్వర్లు, ఏ జి పి సంపేట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top