గిరిజనుల భూములను కాపాడండి

గిరిజనుల భూములను కాపాడండి

TEJA NEWS

గిరిజనుల భూములను కాపాడండి

పాల డైరీ కి వ్యతిరేకం కాదు

పేద రైతు గిరిజనలకు నష్టం జరగకూడదు

  • మాజీ జెడ్పిటిసి బానోతు కొండ

బోనకల్ :- గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కాపాడాలని మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ బోనకల్ తాసిల్దార్ పొన్నం చందర్ ను కోరారు.
శనివారం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతు వేదికలో జరిగిన సభలో మాజీ జడ్పిటిసి బానోతు కొండ మాట్లాడుతూ… గతంలో గిరిజనులకు ప్రభుత్వం సాగు చేసుకునేందుకు బోనకల్ నుండి ఆలపాడు వెళ్లే రోడ్డులో కొంతమంది గిరిజనులకు సాగు భూమిని ఇచ్చి పట్టాలు కూడా ఇచ్చిందని కానీ అది సౌడు భూమి కావడంతో పంట సరిగా పండక కొంతమంది ఖాళీగా ఉంచారని, అదే తరుణంలో తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో మధిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క ఉన్నప్పుడు ఆ భూముల్లో పాల డైరీ తెస్తానంటూ కొంతమంది భూములను తీసుకొని అక్కడ శంకుస్థాపన చేయటం జరిగిందని అన్నారు. అప్పుడు ఆ క్రమంలో ఎవరికైతే భూమి నష్టం జరుగుతుందో ఆ భూమికి బదులు మరొక చాట భూమి కల్పించి పాల డైరీలో ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు బానోతు కొండ తెలిపారు. ఆ తర్వాత క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ పాల డైరీ రాలేదని, తదుపరి కొంతమంది గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారని కొండ పేర్కొన్నారు. కానీ మరలా ఇప్పుడు భట్టి విక్రమార్క పాల డైరీ కోసం పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని, మేము పాల డైరీ కి వ్యతిరేకం కాదని కానీ భూమి కోల్పోతున్న గిరిజన రైతులకు మరొకచోట భూమి ఇచ్చి పాల డైరీలో ఉద్యోగం కల్పించి బట్టి విక్రమార్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, దానికి అధికారులు కూడా సహకరించాలని తాసిల్దార్ చందర్ ను మాజీ జడ్పిటిసి బానోతు కొండ కోరారు. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారని వారికి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో పై కూడా ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ చందర్, ఆర్ ఐ గుగులోతు లక్ష్మణ్, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, మాజీ సర్పంచ్ సైదా నాయక్, గిరిజన నేతలు గుగులోతు పంతు నాయక్, గుగులోతు నాగేశ్వరరావు, బానోత్ శ్రీనివాసరావు, గుగులోతు స్వామి, గుగులోతు నరేష్, భూక్యా విచ్చేశ్వరరావు నాయక్, భూక్య సైదా, బానోతు మురళి , గుగులోతు శ్రీను తదితరులు గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS