జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కల్పించండి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కల్పించండి

TEJA NEWS

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కల్పించండి
బి అర్ ఎస్ ప్రభుత్వం మోసం చేసింది
న్యాయo చేస్తామని మంత్రి హామీ
రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి జర్నలిస్టుల వినతి
సంగారెడ్డి 19(నిఘా న్యూస్)
గత పది ఏళ్లుగా సంగారెడ్డి లో మీడియా రంగం లో పనిచేస్తున్న తమకు గత బిఆర్ ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సేవలు వినియోగించు కోని మోసం చేసిందని జర్నలిస్టులు మంత్రి ముందు తమ అవేదనను వ్యక్తం చేశారు..శుక్రవారం జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రికి జర్నలిస్టు వినతి పత్రం సమర్పించారు.గత బిఆర్ ఎస్ ప్రభుత్వం అబద్ధాలు కేరాఫ్ గా మారిందని రాష్ట ప్రజలను నిలువున మోసం చేస్తూ తమ పాబ్బం గడుపుకొందని పేర్కొన్నారు.కొందరికి కల్పించిన డబుల్ బెడ్రూమ్ లలో కనీస సౌకర్యాలు లేవని అన్నారు.ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం ఎక్కడ చూడలేమని తెలిపారు.ప్రజలు ఇచ్చిన అధికారం అడ్డం పెట్టు కొని అడ్డగోలు పనులకే పరిమితం అయ్యిందనీ పేర్కొన్నారు.జర్నలిస్టులకు మొండి చేయి చూపిన బి అర్ ఎస్ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పారన్నారు.నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అందుకే జెర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నమని తెలిపారు.స్పదించిన మంత్రి దామోదర మా ప్రభుత్వ హయాంలో జేర్నలిస్టులకు న్యాయం చేస్తమన్నారు హామీ నిచ్చారు. . కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, మేఘరాజ్ నాయక్, శ్యాంసుందర్ రెడ్డి, దండు ప్రభు, రవి, బాల్ రాజ్ , డేవిడ్ రాజ్, యాదగిరి, శరత్ బాబు, మహేష్ ,రాజు , ఫోటో జర్నలిస్ట్, ఆరిఫ్, మురళి పవన్ సాయి కృష్ణ సతీష్ పలువురు వీడియో జర్నలిస్టులు, పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS