TEJA NEWS

Pujari Satyanarayana is sure to win as MLC candidate

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయంభద్రాద్రి కొత్తగూడెంలో మార్మోగిన సన్నాహక సమావేశం

బలపరుస్తున్న ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణ ని విద్యావంతులు, మేధావులు 38వ సీరియల్ నంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పట్టభద్రులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షతన జరిగిన ముఖ్య సమావేశంలో మారెల్లి విజయకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి కోసం శాసనాల ప్రతిపాదనల కోసం చర్చలు చేయాల్సిన పెద్దల సభకు శాసనమండలికి విద్యావంతులైన మేధావులను పంపాలని ఈ సందర్భంగా విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పట్టు ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో నిష్కల్మషంగా, నిజాయితీగా పనిచేసిన రిటైర్డ్ ఎంఈఓ, సామాజిక ఉద్యమకారులు పూజరి సత్యనారాయణ ని ఓటు అనే ఆయుధం ద్వారా విద్యావంతులు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పూజరి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి గెలిపించినట్లయితే పేద ప్రజల రుణం తీర్చుకుంటానని, విద్యా ఉద్యోగ పారిశ్రామిక రంగాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది చట్టసభల ద్వారా పేద ప్రజలగొంతునై వినిపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సామాజిక ఉద్యమకారులు, ఆర్టిఐ కార్యకర్తలు, పలు సామాజిక కుల ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యనారాయణ గెలుపు కోసం పని చేస్తామని
చెంచాని శ్రీనివాసరావు,
తోట రాధాకృష్ణ, కరుణకర్,
లక్ష్మి, చారి, కిరణ్ కుమార్
రావుల నరసయ్య, శ్రీధర్ శర్మ,
శెట్టి సంపూర్ణ మద్దతును ప్రకటించారు.


TEJA NEWS