TEJA NEWS

రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి

శంకర్‌పల్లిలో డా. లలిత సంతాన సాఫల్య కేంద్రం ఆసుపత్రిని ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

శంకర్‌పల్లి: ఆగస్టు 28: పేదలు, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. బుధవారం శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ లలిత ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి యాజమాన్యం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో సేవలందించాలని తెలియజేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులను ముందుగా ప్రేమగా పలకరించి, అనంతరం వారి సమస్యలను తెలుసుకొని సేవలందించాలని సూచించారు. వైద్యో నారాయణి హరి అంటారని, కనిపించే డాక్టర్లే దేవుళ్ళతో సమానమని పేర్కొన్నారు. డాక్టర్ లలిత మాట్లాడుతూ సంతానం లేని దంపతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులచే అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాన్ని పట్టణ ప్రజల కొరకు ప్రారంభించామన్నారు. సంతానం లేని దంపతులకు అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్న మొట్టమొదటి ఆసుపత్రిని పట్టణంలో నెలకొల్పామన్నారు. హార్మోన్ల పరీక్షలు, అత్యాధునిక ఆండ్రాలజీ ల్యాబ్, ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్సలు, (ఐయుఐ) ఇంట్రా యూట రైన్ఇన్ సెమినేషన్, ఐవిఎఫ్ ఈటి (ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఎంబ్రయో ట్రాన్స్ ఫర్), ఐసి ఎస్ఐ (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజక్షన్), అండాలను నిల్వ చేయడం, అండ దానం వంటి సేవలను మా ఆసుపత్రి అందిస్తుందని తెలియజేశారు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ లలిత శ్రీనివాసులు ఎమ్మెల్యే యాదయ్య ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే యాదయ్య… డాక్టర్ లలిత శ్రీనివాస్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు సంతోష్ రాథోడ్, చంద్రమౌళి, కమల మధు, సవిత చిరంజీవి, చెన్న నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS