కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ కమిటీ సన్నాహక సమావేశం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ కమిటీ సన్నాహక సమావేశం

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ కమిటీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సన్నాహక సమావేశం గాజులరామారంలోని సిటీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ , ఎఐసిసి అబ్జర్వర్, తమిళనాడు ఎంపీ సిన్నమలై జ్యోతి మణి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి భూపతిరెడ్డి , టిపిపిసి కోఆర్డినేటర్ కొండ్రు శోభారాణి తో కలిసి పాల్గొన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసం బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త పనిచేయాలని, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుండి లక్ష మెజారిటీ ఇచ్చి సునీత మహేందర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి లు జోత్స్నా శివారెడ్డి, సొంఠి రెడ్డి పున్నారెడ్డి, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మా రెడ్డి, సీనియర్ నేతలు బొడ్డు వెంకటేశ్వర్ రావ్, దమ్మని శ్రవణ్ కుమార్, గుంజ శ్రీనివాస్, బండి శ్రీనివాస్ గౌడ్, జహంగీర్ భాయ్, బొబ్బ రంగా రావ్, దుర్గా రావ్, చాంద్ పాషా, సంజీవ రెడ్డి, రషీద్ బేగ్, డివిజన్ అధ్యక్షులు, ఇంచార్జులు, జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిదులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS