TEJA NEWS

రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా?

అమరావతి:
వైసిపికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్యాలకుమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, రాజీనామాలు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే, వీరు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి,

ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

ఈ రాజీనామాను రాజ్య సభ ఛైర్మన్ ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయినట్టుగా రాజ్యసభ సెక్రటేరియట్ బులెటిన్ ను విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.

ఈ తరుణంలో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఈ ప్రచారానికి బలాన్ని ఇచ్చినట్టైంది.


TEJA NEWS