TEJA NEWS

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ముమ్మరంగా పర్యటించారు. పోలిశెట్టి గూడెంలో కోదండ శ్రీ రామాలయం, రాంక్యాతండాలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ట వేడుకలకు హాజరై.. ప్రత్యేక పూజలు చేశారు. హరిత గార్డెన్స్ లో కైకొండాయి గూడెం కు చెందిన నాగటి ఉపేందర్ కుమార్తె వివాహానికి హాజరై దీవించారు. శ్రీ లక్ష్మీ చంద్ర గార్డెన్స్ లో కొత్తకొండ కొండల్ రావు కుమార్తె, లక్ష్మీ గార్డెన్స్ లో గుండా దామోదర్ రెడ్డి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దానవాయిగూడెంలో చిన్నారి శుభకార్యానికి వెళ్లి దీవించారు.


TEJA NEWS