తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..
న్యూ ఢిల్లీ:
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్ లో నీళ్లుపోసి కలపడంతోపాటు తాపీతో మెట్ల నిర్మాణం చేపట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికా రిక ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారని తెలిపింది.
ఢిల్లీలోని గురు తేజ్ బహ దూర్ నగర్ లో కొందరు భవన నిర్మాణ కార్మికులను రాహుల్ సాయంత్రం కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కాసేపు వారితో కలిసి భవన నిర్మాణ పనుల్లో పాలుపంచు కున్నారు…