లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు
Aug 02, 2024,
లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు
లావణ్య తమను ఇబ్బందులకు గురిచేస్తోందని హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఇద్దరికీ పలు అనారోగ్య సమస్యలున్నాయని తెలిపారు. ఆమె తమ ఇంటికి వచ్చి తలుపులు బాది, కేకలు వేసి న్యూసెన్స్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశారని లావణ్య కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.