ఫతేపూర్ బ్రిడ్జి పనులు పరిశీలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ
*పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడానికి ట్రాఫిక్ పోలీస్ తరపున కావలసిన పర్మిషన్స్ ఇస్తాము
*కాంట్రాక్టర్ జాతకం వల్లనే పనులు ఆలస్యం
శాశ్వత పరిష్కారం చేయాలని ఆర్ అండ్ బీ ఆఫీసర్ రమేష్ తో మాట్లాడిన చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశం
శంకరపల్లి : రాజేంద్రనగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ ఏ బాలాజీ చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశం తో కలిసి ఫతేపూర్ బ్రిడ్జి శంకరపల్లి వద్ద నిలిచిపోయిన రోడ్డు పనులను మరియు అండర్ బ్రిడ్జి వద్ద వర్షం పడ్డప్పుడు నీటి నిల్వ గురించి పరిశీలించి ఆర్ అండ్ బి డీఈ రమేష్ తో మాట్లాడారు.దీనిలో భాగంగా పెండింగ్ వర్క్ ను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రాఫిక్ తరఫున కావాల్సిన పర్మిషన్, సహకారాన్ని అందిస్తామని తెలిపారు.బ్రిడ్జి కింద నిలిచిపోయిన నీళ్ల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానికి శాశ్వత పరిష్కారం చేయాలని సూచించారు .తాత్కాలికంగా జెసిబి సాయంతో నిలిచిన నీటిని తీసి వేశారు.దానికి వారు స్పందిస్తూ కాంట్రాక్టర్ జాతకం వల్లనే పనులు ఆలస్యం జరుగుతుందని పనులను త్వరలో చేస్తామని చెప్పరు .కార్యక్రమంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసిపి బాలాజీ ,చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశం మరియు సిబ్బంది పాల్గొన్నారు.