రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయం..

రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయం..

TEJA NEWS

Rajiv Gandhi's life is exemplary..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు.

రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయం..
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి..
చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు..
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పుల మాలలు వేసి, మౌనం పాటించి, నివాళులు అర్పించారు.
ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
రాజీవ్ గాంధీ భారత దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారు.
ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు.
కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారు.

అన్నివర్గాల ప్రజలకు మత స్వేచ్చ కల్పించారు.
ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం పెంచేందుకు ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్ళకు తగ్గించారు.
భారత దేశంలో సాఫ్ట్వేర్ రంగానికి పునాది బాటలు వేశారు.
1986 లో అయోధ్య లో రామ మందిరంలో తలుపులు తెరిచారు.
రామ మందిర నిర్మాణానికి కృషి చేశారు.

1989 లో అయోధ్య లో శిలా న్యాస్ నిర్వహించారు.
ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ ను గౌరవించిన ప్రజాస్వామ్య వాది రాజీవ్ గాంధీ.
ప్రతి భారతీయ పౌరుడు ఆదర్శంగా తీసుకునే గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ.
ప్రపంచ శాంతి దూత రాజీవ్ గాంధీ.
ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ బాటలో నడువాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS