TEJA NEWS

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి రాపోలు నీలావతి రూ. 12 లక్షల విరాళం

శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి శుక్రవారం రాపోలు నీలావతి భక్తురాలు రూ. 12 లక్షల చెక్కు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 12 లక్షల విలువగల వెండితో స్వామి వారికి గర్భగుడిలో ప్రాణమఠం చేయించడానికి అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఆలిండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు, గౌరవాధ్యక్షులు సదానందం గౌడ్, ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, అన్నదాన కమిటీ చైర్మన్ దర్శన్ గౌడ్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ ఆమెను స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపాల్, ఆలయ పూజారి ప్రమోద్ ఉన్నారు.


TEJA NEWS