త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం

త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం

TEJA NEWS

త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం

హైదరాబాద్:ఫిబ్రవరి 13
తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు కొత్తగా 1000 మంది హోంగార్డులను నియమి స్తున్నట్లు ఆయన ప్రకటించారు.

జాతీయ రోడ్డు భద్రతా మాసో త్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వెస్ట్‌జోన్‌ ఆధ్వర్యంలో బంజారా హిల్స్‌లోని సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిష నర్‌.. అంతరిక్షంలోకి ప్రవేశించిన మనం భూమిపై ట్రాఫిక్‌ నిబంధనలను పాటించడంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకోవా లని సూచించారు.

నగరంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడిపితే ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌.. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తనకు ఇది రెండో జీవితం అని వ్యాఖ్యానించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS