TEJA NEWS

ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..
మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు…

హైదరాబాద్‌, : రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది.

మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.

ఈ మేరకు ఆయా జిల్లాకు రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లోఅలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లిలో అత్యధికంగా 5.76 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS