రెడ్ హౌస్ వైట్ హౌస్ కాదు అదొక బ్లాక్ హౌస్ : జగదీష్ రెడ్డి

రెడ్ హౌస్ వైట్ హౌస్ కాదు అదొక బ్లాక్ హౌస్ : జగదీష్ రెడ్డి

TEJA NEWS

Red House is not a White House but a Black House: Jagadish Reddy

రెడ్ హౌస్ వైట్ హౌస్ కాదు అదొక బ్లాక్ హౌస్ : జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాజు హోటల్ కూల్చివేతపై స్పందించిన సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రజా ఉద్యమాలతో రాక్షస పాలనను అడ్డుకుంటామని సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరో నిదర్శనం జాజు హోటల్ కూల్చివేత అంటూ సూర్యాపేటలో జరుగుతున్న సంఘటనలను ఉద్దేశించి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రజలు ఓట్లు వేయలేదని ఉద్యోగులను వ్యాపారులను ఇతర పార్టీల రాజకీయ నాయకులను ప్రాణాలు కాపాడే డాక్టర్లను అందరిపై దాడులు చేయడం జరుగుతుందనీ రాజరిక పాలనలో లేని అరాచకం రాష్ట్రంలో కొనసాగుతుందనీ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భవనాలు కూల్చడం ఆనవాయితీగా ఉన్నదనీ ఎద్దేవ చేశారు. సూర్యాపేట లోని జాజు హోటల్ ఎత్తు ప్రాంతంలో ఉన్నదని సూర్యాపేట సగం కొట్టుకుపోయిన ఇక్కడికి నీళ్లు వచ్చే అవకాశమేలేదన్నారు. ఐదు నెలల క్రితం ఎఫ్.పి.ఎల్ పరిధిలో ఉందని నోటీసులు ఇచ్చారని ఇది కొత్త నిర్మాణం కాదని 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారనీ గుర్తు చేశారు. నోటీసుకు సంజయిషి ఇవ్వకుండా కొందరు కూల్చివేతలకు పాల్పడడం ప్రభుత్వం నుంచి ఏ శాఖకు చెందిన అధికారులు వచ్చి కూల్చారో తెలియదన్నారు. రెడ్ హౌస్ వైట్ హౌస్ అంటూ ఏమీ లేవని ఒక బ్లాక్ హౌస్ మాత్రమే నరక కూపంగా ఉందని అధికారులను అక్కడకు పిలిచి ఒత్తిళ్లకు గురిచేసి ఆదేశాలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. అధికారులు నిబంధనల ప్రకారం పని చేయాలి తప్ప దారిన పోయే దానయ్యలు చెబితే కూల్చివేతలకు పాల్పడవద్దనీ హెచ్చరించారు. మూడుసార్లు ప్రజలు బుద్ధి చెప్పిన సోయి రాకుండా మాజీ మంత్రి మతిస్థిమితం తప్పే ప్రవర్తిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ విషయమై కలెక్టర్ ఎస్పీలకు విన్నవించుకుంటామని తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS