డిసెంబర్ 9లోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకోండి
*బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ
జగిత్యాల:
జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9వ తేది వరకు ఎన్నికల కమిషన్ గడువు పెంచింద న్నారు పట్టబద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మరో 13 రోజుల గడువు మాత్రమేఉందన్నారు, పట్టబద్రులు, ఓటు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా పట్ట బద్రులను కోరారు, అప్లికేషన్ తో పాటు వారి ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు అందజేస్తే ఆన్ లైన్లో నమోదు చేసి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తారనిముసిపట్లలక్ష్మినారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టభద్రులు అందరూవినియోగించుకోవాలనికోరారు.కరీంనగర్,నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో లక్షలాదిమంది పట్టభద్రులు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో అతి స్వల్పంగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని అన్నారు.
గత ఎన్నికల్లో అదే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదై, మెజారిటీ సంఖ్యలో ఓటు హక్కువినియోగించుకుంటారనిఅన్నారు.గతంలోనిరుద్యోగుల గురించి ఏ నాయకుడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు నిరుద్యోగులకు అండగా నిలిచి ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారధిగానిలిచివారిసమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోని పట్టభద్రులు 12 లక్షల మంది పైచిలుకు ఉన్నారని దయచేసి వారంతా ముందుకువచ్చి తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. కేవలం ఇప్పటివరకు 4 లక్షల మంది పట్టబద్రులు మాత్రమే నమోదు చేసుకొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్,విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ,మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.