TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సర్వేనెంబర్ 58 నుండి 226 వరకు రిజిస్ట్రేషన్లు పునరుద్ధరనకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి బిల్డర్లు కృతజ్ఞతలు తెలిపారు.

కుత్బుల్లాపూర్ టౌన్ పరిధిలో అక్కడక్కడ వక్ఫ్ బోర్డ్ స్థలాల నెపం చూపిస్తూ, సర్వేనెంబర్ 58 నుండి 226 వరకు గత కొద్ది కాలంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో, దానిని పునరుద్దరించాలని కోరుతూ పద్మనగర్ పేస్ – 2 కాలనికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి గతంలో వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యపై జిల్లా ఇన్ఛార్ మంత్రి శ్రీధర్ బాబు, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కూన శ్రీశైలం గౌడ్ తీసుకెళ్లారు. అదే విధంగా సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిష్కారం చూపినందుకు శ్రీశైలం కి కుత్బుల్లాపూర్ బిల్డర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా షాపూర్ నగర్ లోని శ్రీశైలం గౌడ్ నివాసంలో ఆయనకు బిల్డర్లు కాలనీ వాసులు బొకే ఇచ్చి శాలువతో శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అప్పారావు, దుర్గారావు, ఓబుల్ రెడ్డి, హర్ష, సత్యనారాయణ, రంగారావు, రాజనాల శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, వెంకన్న, వెంకటరత్నం, రాజీవ్, వెంకటేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS