హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నిరశిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న INTUC జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ .
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా ఉన్న అనేక చట్టాలను రద్దు చేసి ప్రవేశపెట్టిన 4 కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్ 23 న దేశ వ్యాప్తంగా “బ్లాక్ డే ” గా పాటించాలని కేంద్ర కార్మిక సంఘాలు,(INTUC-AITUC- HMS-CITU-AIUTUC-TUCC-SEWA-AICCTU-LPF-UTUC) మరియు రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు లో బాగంగా ఈ రోజు హైదరాబాద్ లోని RLC ఆఫీస్ లో తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ
ఎన్నో పోరాటాలు చేసి సాదించుకున్న PF,ESI, గ్రాట్యుటీ, వారాంతపు సెలవు,అదనపు పనికి అదనపు వేతనం, కనీసవేతనం,సమానపనికి సమానవేతనం,వేతన ఒప్పందాలు మోదలైన వాటి స్తానంలో వర్కైగ్ కండిషన్ కోడ్,పారిశ్రామిక సంబందాల కోడ్ సామాజిక బద్రత కోడ్,వేతన కోడ్ ఈ 4 కోడ్స్ ను తెచ్చారని కొత్త లేబర్ కోడ్స్ అమలైతే కార్మకులు ప్రస్తుతం ఉన్నహాక్కులను కోల్పోతామని.
వాటి రద్దు కోసం అన్ని సంఘాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో INTUC-AITUC- HMS-CITU-AIUTUC-TUCC-SEWA-AICCTU-LPF-UTUC నుండి INTUC జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా , నాగన్న గౌడ్ , విజయ్ కుమార్ యాదవ్ , మల్లేష్ మరియు అన్ని సెంట్రల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.