TEJA NEWS

Review meeting with NMC officials at Nizampet Municipal Office

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ,పెండిగ్ లో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు,అవసరమైన మౌలిక సదుపాయాల గురించి చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది. భాగంగా మేయర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి, పెండింగ్ దశలో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,డ్రైనేజ్ లు,SNDP నాలా,ట్రాఫిక్ ఇబ్బందులు,రోడ్ ప్యాచ్ వర్క్స్ ,పెరిగిన చెట్లు,విద్యుత్ తీగలు,స్తంభాలు,వరద నీటి తొలగింపు చర్యలు,పురాతన నిర్మాణ సముదాయాల పట్ల జాగ్రత్త,వంటి విషయాలపై ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ ,శానిటేషన్,ఎలక్ట్రికల్, హార్టికల్చర్,మాన్సూన్ టీమ్,ఆయా విభాగాల అధికారులతో సుధీర్ఘంగా చర్చించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఆగం పాండు ముదిరాజ్, చిట్ల దివాకర్,ఇంద్రజిత్ రెడ్డి , సురేష్ రెడ్డి,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,NMC ఆయా విభాగాల అధికారులు,మరియు సిబ్బంది,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS