TEJA NEWS

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం..

నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 21
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఘాట్‌రోడ్డులో లారీ అడ్డంగా ప‌డిపోవ‌డంతో రాక‌పోక‌లు స్తంభించాయి.

ఘ‌ట‌న స్థ‌లానికి పోలీసులు చేరుకొని లారీల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు…


TEJA NEWS