TEJA NEWS

టేకుమట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ఉదయం హైదరాబాదు నుండి విజయవాడకు వెళుతున్న AP 24 16 EH 0111 నెంబరు గల ఫార్చునర్ వాహనం సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటివరకు కుడివైపు డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్ టేకుమట్ల బస్టాండ్ వద్దకు రాగానే ఒక్కసారిగా ఎడమ వైపుకు రావడంతో వెనుక నుంచి వస్తున్న కారు లారీని ఢీకొట్టినట్టు ఫార్చునర్ డ్రైవర్ రాజేష్ తెలిపారు. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ పొరపాటు లేకపోవడంతో అప్పటికే సంఘటన స్థలం నుంచి లారీతో పాటు వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు


TEJA NEWS