
ఎస్.ఆర్. నాయక్ నగర్ శ్రీ పెద్దమ్మ పోచమ్మ తల్లి ఆలయ 20 వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ..
130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ లో గల శ్రీ పెద్దమ్మ పోచమ్మ తల్లి ఆలయ 20వ వార్షిక మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.పి. వివేకానంద్ మాట్లాడుతూ అమ్మవారి కృపతో ఎస్.ఆర్.నాయక్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతిసమృద్ధిగా జీవించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్ధించానని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, కొంపల్లి మాజీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్,కొంపల్లి మున్సిపల్ బి.ఆర్.ఎస్.పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, రుద్రా అశోక్, పుప్పాల భాస్కర్,నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ,పీ.వి. భాస్కర్ రెడ్డి,హరిబాబు యాదవ్,పూర్ణ చందర్ గుప్త , జగతయ్య, అనిల్, రామకృష్ణ, దుర్గారావు, మహేందర్ రెడ్డి, వల్లూరి ప్రసాద్, రాజేష్, ఆలయ కమిటి సభ్యులు. బొబ్బా రంగారావు, బొబ్బ ప్రసాద్, రాజగోపాల్ రెడ్డి, ఆలూరి వెంకట శేషయ్య మరియు భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
