TEJA NEWS

కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఎస్.ఎ.జి టైలరింగ్ మరియు బ్యూటిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు…

విద్యార్థులు చదువుతోపాటు తరగతుల్లో శిక్షణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.

సుల్తానాబాద్ మండలం, భూపతిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థులకు దుర్గబాయి మహిళ శిశు వికాస కేంద్రం, ఎల్. ఎం.డి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SAG టైలరింగ్ & బ్యూటిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని శిక్షణ తరగతులలో నైపుణ్యం పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు టైలరింగ్ & బ్యూటిషన్ సంబందించిన సమగ్రీని విద్యార్థులకు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్ర సంస్థ యాజమాన్యంతో, తెలంగాణ ఉమెన్స్ కో- ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి. బండ్రు శోభారాణి గార్లతో కలిసి పంపిణి చేసి అనంతరం శిక్షణ తరగతులను ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు…

ముందుగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే గారికి విద్యార్థులు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతం పలికారు…

తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే విజయరమణ రావు గారు…

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ..

విద్యార్థులు చదువుతో పాటు వృత్తి విద్యా తరగతులల్లో శిక్షణ తీసుకొని విద్యార్థుల స్వతగా నిలబడాలని అన్నారు. 2011-12 సంవత్సరం నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే కస్తూర్బా బాలికల విద్యాలయ నిర్మాణం కోసం ఆరోజు భూమి పూజ చేసిన అనంతరం సంవత్సరంలోపే కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని నిర్మాణం పూర్తి చేసుకొని 6-7 తరగతుల నుండి ఈ పాఠశాలను ప్రారంభించుకోవడం జరిగింది..

ఈరోజు కస్తూర్బా బాలికల విద్యాలయం పాఠశాల స్థాయి నుండి ఇంటర్ స్థాయికి ఎదగడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది అని తెలిపారు..

గత పాలకులు వారి స్వార్థం కోసం ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీ లను నాశనం చేశారని విమర్శించారు.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే తపనతో ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. టీచర్స్ అడిగిన విధంగా విద్యాలయన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాలికలకు చదువుతోపాటు అన్ని రకాల నైపుణ్యాలను అందించడం కోసం నిర్వహిస్తున్న ఇటువంటి శిక్షణ తరగతులను విద్యార్థులను ఉపయోగించుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ మేనేజర్ విజయ శ్రీ గారు, డిస్ట్రిక్ట్ మేనేజర్ జయశ్రీ గారు, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కవిత గారు, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఎం .స్వప్న గారు, విద్యార్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS