TEJA NEWS

ఫోటోగ్రఫీ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శిగా సంపత్

ఉమ్మడి ఖమ్మం

ఖమ్మానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, కృషి స్టూడియో అధినేత చావా సంపత్ కుమార్ తెలంగాణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి స్వచ్ఛందంగా కృషి చేస్తూ.. యావత్ ఫోటోగ్రాఫీ రంగం అభివృద్ధికి కృషి చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుస్సేన్ తెలిపారు. ఇప్పటికే సంపత్ పలు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు ఫోటోగ్రఫీలో అందుకున్నారు. ఈ సందర్భంగా సంపత్ ను పలువురు అభినందించారు. ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ సంక్షేమానికి కృషి చేస్తానని సంపత్ ఈ సందర్భంగా తెలిపారు .


TEJA NEWS