TEJA NEWS

మహిళలకు చీరలు పంపిణీ చేసిన : ప్రత్తిపాటి..

మస్తాన్ వలి నీ అభినందించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి

చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోనీ లింగంగుంట్ల గ్రామంలో
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకుడు, మండల తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మస్తాన్ వలి ఆధ్వర్యంలో 200 వందల మందికి
చీరాల పంపిణీ కార్యక్రమంలో మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని చీరాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ముందుగా అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలుతెలిపారు. పవిత్రమైన రంజన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించి ఉన్నా దానిలో కొంత పరులకు దాన ధర్మాలు చేయడం వంటి సమాజ హితం కోసం ఎన్నో గొప్ప విషయాలను ముస్లింల పవిత్ర గ్రంథమైన కురాన్ మనకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఏ మత గ్రంథమైన చెప్పేది ఒక్కటే మానవ సేవే మాధవ సేవా అని అయితే,రంజన్ మాసంలో పేద ధనిక తార తమ్యం లేకుండా అందరు పండుగ జరుపుకోవాలని
సారాంశంను ఖచ్చితంగా రంజాన్ పండుగ సందర్భంగా ఆచరించటం జరుగుతుంది..దాంట్లో భాగంగానే ప్రతీ ఏటా యువ నాయకుడైన మన మస్తాన్ వలి పేదలకు తన వంతు సహాయం చేయడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ , మునిసిపల్ చైర్మన్ రఫాని , తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా , జవ్వాజి మదన్ , పఠాన్ సమద్ , గంగా శ్రీనివాసరావు , కందుల రమణ , మద్దుమల రవి,కౌన్సిలర్ మౌలాలి, కోడె మణి, కిషోర్, మరియు మండలం, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…