TEJA NEWS

గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సర్కార్ చేయూత…

జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 5మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 25లక్షల రూపాయల విలువగల ప్రొసీడింగ్ కాపీలను భాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .

ఎమ్మెల్యే మాట్లాడుతూ….

గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది

ఉపాధి నిమిత్తం గల్ఫ్ కి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల పరిహారం చాలా గొప్ప కార్యక్రమం.

ఏడు గల్ఫ్ దేశాలలో మరణించిన గల్ఫ్ కార్మికులు ఆరు నెలల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవడంతో ఐదు లక్షలు పరిహారం అందుతుంది.

గత దశాబ్ద కాలం నుండి గల్ఫ్ సంఘాల,NRI సంఘాలు NRI పాలసి కోసం అనేక మార్లు వినతి సమర్పించారు.

ముఖ్యమంత్రి గల్ఫ్ కార్మికుల భాధలను అర్థం చేసుకొని 5 లక్షలు అందజేయటం వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా భరోసా ఇచ్చారు.

గురుకుల పాఠశాలలో కళాశాలలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యం.

ప్రజా భవన్ లో NRI సెల్ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి..

గత ప్రభుత్వం 4 ఏండ్ల లో 16 వేల కోట్లు రుణ మాఫీ చేస్తే,నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏకకాలం లో 18 వేల కోట్లు రుణ విముక్తి చేయటం జరిగింది.

ఈరోజు నుండి ఈనెల 30 వరకు నిర్వహించే రైతు పండుగలో రైతులందరూ పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు ,మాజీ జెడ్పిటిసి ఎల్లారెడ్డి , నాయకులు బాల ముకుందం,గడ్డం నారాయణరెడ్డి,చెరుకు జాన్, చిర్ర నరేష్ ,రాజేశ్వర్ రెడ్డి, ప్రకాష్, రవీందర్రావు, గుంటి రవి, శ్రీనివాసరావు, శాంతపు రావు,జైరాం సురేష్, వెంకటేష్ ,రాజు, మోహన్ రెడ్డి ,సునీల్ ,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS