TEJA NEWS

సీఎంఆర్ లక్కీ డ్రా ధమాకా మోసం స్కీముల పేరుతో స్కాములు

ఉచితంగా వచ్చిన స్కూటర్ కి సగం డబ్బులు కట్టాలంటున్న వైనం

బట్టల వ్యాపారం పేరుతో స్కూటర్ల వ్యాపారానికి తెరలేపిన సీఎంఆర్

సూర్యాపేట జిల్లా : జిల్లా కేంద్రంలో చిన్న చిన్న బట్టల దుకాణాల వ్యాపారాన్ని మంటగలిపి బడా కార్పొరేట్ సంస్థగా సూర్యాపేటలో సీఎంఆర్ షాపింగ్ మాల్ పండుగల పేరుతో లక్కీ డ్రాలు అంటూ వినియోగదారులకు కుచ్చుటోపి పెట్టుతున్న సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా నిర్వహిస్తున్న సీఎంఆర్ షాపింగ్ మాల్ పట్టణంలో బట్టల వ్యాపారాన్ని పెంచుకునేందుకు వినియోగదారులకు అనేక రకాల స్కీముల ను ప్రవేశపెడుతూ స్కాముల కు పాల్పడుతుంది. ఇటీవల దసరా, దీపావళి పండుగల పేరుతో లక్కీ డ్రాలు అంటూ మోటర్ సైకిల్లు, కార్లను వినియోగదారులకు ఆశ చూపింది. ఈ కోవలో పలువురు వినియోగదారులు మోసపోయి బజారున పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పబ్బ సౌమ్య పండుగ సమయంలో షాపింగ్ చేసి పదివేల రూపాయలు కొనుగోలు చేయగా మూడు కూపన్లను నిర్వాహకులు ఇవ్వడం జరిగింది.

ఈ మూడు కూపన్ల లో ఒక కూపన్ లక్కీ డ్రాలో స్కూటీ గెలుచుకోగా షాపింగ్ మాల్ నిర్వాహకులు హంగామా చేసి వారికి తాళాలు ఇచ్చినట్టు ఫోటోలు దిగి పోజులు ఇచ్చారు. తర్వాత స్కూటీని అడిగితే ఓ 20000 కట్టండి స్కూటీ ఇస్తామని చెప్పగా వినియోగదారులు 20వేల రూపాయలను డిడి రూపంలో షాపింగ్ మాల్వారికి చెల్లించడం జరిగింది. అనంతరం షోరూం కు వెళ్లి స్కూటీ తీసుకోవాలని చెప్పడంతో వారు షోరూం కు వెళ్లగా అక్కడ మరో 26,000 కట్టాలని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఇదేమిటని సిఎంఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులను ప్రశ్నిస్తే బైక్ ధర లో సగం మీరే చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలో ఉందని అది మీరు చూసుకోవాలని అది చూసుకోకపోవడం మీ పొరపాటే అని చెప్పడం జరిగింది. దీంతో బాధితులు శుక్రవారం రాత్రి షాపింగ్ మాల్ ముందు ఆందోళన నిర్వహించి సగం డబ్బులు మాతో కట్టించుకుంటే ఇక మీరు లక్కీ డ్రాలో మాకు స్కూటర్ ఇచ్చినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

సీఎంఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు బట్టల అమ్మకాల పేరుతో బైకుల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బైకుల పేరుతో నిరుపేదలను మోసం చేస్తూ లక్కీ డ్రాలో వచ్చిన బైకులను డబ్బులు కడితేనే ఇస్తామని ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. బైకు ధరలు సగం డబ్బులు మేమే కడితే ఇక మీరు బైకు ఇచ్చింది ఏముందని ఇలా డబ్బులు కట్టాల్సి ఉంటుందని ముందుగా షాపింగ్ మాల్ నిర్వాహకులు మాకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో చిన్నచిన్న బట్టల వ్యాపారులు, గణేష్ బొమ్మల వద్ద సైతం స్కూటర్లు లక్కీ ద్వారా అందజేశారని వారు ఎప్పుడు ఇలా వసూలు చేయలేదన్నారు. వచ్చేరాని స్కీములు పెట్టి మహిళలను మోసం చేసే ఆలోచనలకు సీఎంఆర్ షాపింగ్ మాల్ స్వస్తి చెప్పాలని లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై వినియోగదారుల పోరాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు పబ్బ పవన్ సౌమ్య దంపతులు పేర్కొన్నారు.


TEJA NEWS