School buses must be kept in good condition
స్కూల్ బస్ లను తప్పనిసరిగా కండిషన్ లో ఉంచాలి..
వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ విస్తృత తనిఖీలు..
బోనకల్ మండలంలో రెండు స్కూల్ బస్సులు సీజ్..
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన్నందున స్కూల్ యాజమాన్యాలు పిల్లలను రవాణా చేసే బస్సులను తప్పనిసరిగా కండిషన్ లో ఉంచుకోవాలని వైరా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. వరప్రసాద్ సూచించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఆయన స్కూళ్ళు, కాలేజీల బస్సులను తనిఖీలు చేపట్టారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సు లపై ఫొకస్ పెట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని స్కూలు బస్సులపై వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ , టాక్స్ లేకుండా నిబంధనలను పాటించని రెండు స్కూల్ బస్సులును సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫయర్ సేఫ్టి కిట్, ఫస్ట ఎయిడ్ కిట్ అన్ని తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా బస్సులను విచ్చలవిడిగా తిప్పితే చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమానాలు విధించడం జరుగుతుందని వెల్లడించారు. స్కూల్లు, కళాశాలల యాజమాన్యాలకు ఆయన క్షుణ్ణంగా అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.