
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి.
కమిషనర్ ఎన్.మౌర్య.
నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో గల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనివాసం, పెద్దకాపు లేఔట్, ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, రెండో వార్డులో గల సచివాలయాలను, చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు మీ సచివాలయాల పరిధిలో చేయాల్సిన అన్ని సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.
పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ అనధికారిక లేఅవుట్లు, తదితరాలను గుర్తించి కట్టడి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.లు రమణ, రాజు, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏ.సి.పి.బాలాజి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.
