TEJA NEWS

హైదరాబాద్ లో 144 సెక్షన్…

హైదరాబాద్:
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర రాజధాని హైదరాబా ద్ నగరంలో నేడు 144 సెక్షన్ అమల్లోకి తీసుకు వచ్చింది ఇందు కోసం హైదరాబాద్ -సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో కఠిన నిబంధనలను ఉంటాయని పోలీసు శాఖ నోటీసులను జారీ చేసింది.

ఈ 24 గంటల్లో ఎలాంటి ధర్నాలు, నిరసనలు, ఆందోళనలను చేపట్ట కూడదని హెచ్చరించింది. అలా నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.

ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బామ్మర్థి ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని..కేటీఆర్ బామ్మర్ది సోదరుడికి చెందిన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ దగ్గర పోలీసులు నిర్వహించిన నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిస్తారని పోలీసు శాఖ ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది….


TEJA NEWS