పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్ పార్సిగుట్ట లో బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..
స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , మహిళలు మంగళ హారతులతో పద్మారావు గౌడ్ కు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.
సంజీవ పురం , అశోక్ నగర్ , మధుర నగర్ లతో పలు బస్తీలలో ఇంటింటికి తిరుగుతూ బి.ఆర్.ఎస్ పార్టీ కి ఓటు వేసి పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఓటర్ల ను పద్మారావు గౌడ్ అభ్యర్థించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే నాకు అండగా ఉన్నారో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో అండగా ఉండాలని కార్యకర్తలకు పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
అటు ఓటర్ల నుండి పద్మారావు గౌడ్ కు ప్రజాదరణ తో పాటు అనూహ్య స్పందన వచ్చింది. గత పది సంవత్సరాలలో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని పద్మారావు గౌడ్ ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ , కంది శైలజ , లక్ష్మీ ప్రసన్న , రాసురి సునీత , యువజన విభాగం రాష్ట్ర నాయకులు రామేశ్వర్ గౌడ్ , కిరణ్ గౌడ్ , స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడప గడప కు పజ్జన్న ప్రచార కార్యక్రమం..
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…