ఒకే ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి పేదింటి యువకుడి ఎంపిక.
డిఎస్సి ఉద్యోగ ఎంపికలో టాపర్ గా గ్రామీణ అభ్యర్థి .
జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన
జాజిరెడ్డిగూడెం మండల అభ్యర్థి.
సూర్యాపేట జిల్లా : ఈనెల 30 న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అభ్యర్థి తన సత్తా చాటుకున్నారు.డిఎస్సిలో ఎంపికలో భాగమైన ఫిజికల్ డైరెక్టర్(స్కూల్ అసిస్టెంట్) విభాగంలో)జిల్లాలో ఉన్న ఒకే ఒక్క పోస్టుకు అతను ఎంపికై ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపారు.విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అభ్యర్డులు ప్రభుత్వం కేవలం 75 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించి ఆ పేద అభ్యర్థి కుటుంబంతో పాటు జిల్లాలో ఎంపికైన 386 కుటుంబాల్లోనూ ఆనందాన్ని నింపింది.అందుకోసం ఎంపికైన అభ్యర్థుల ఈనెల ఒకటి నుండి 5 వరకు జిల్లా విద్యాశాఖ వెరిఫికేషన్ ప్రారంభించగా జిల్లాలో ఎస్జిటి అభ్యర్థుల సర్టఫికెట్లను పరిశీలించింది.కాగా నేటి నుండి (గురువారం) 5 వరకు స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన అభ్యర్థుల సర్టఫికెట్లను పరిశీలించనుంది.
జిల్లాకు నిరుద్యోగులకు ఆదర్శమైన ఆ అభ్యర్థి…..
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన చెరుకు తిరుపతయ్య – భారతమ్మ దంపతుల కుమారుడైన చెరుకు నాగేందర్ ఎం.పిఈడి ట్రైనింగ్ పూర్తి చేశాడు.అందుకు ప్రభుత్వం ఉద్యోగ వేటలో ఉన్న అతను ప్రభుత్వం ఆగష్టు 5న నిర్వహించిన పరీక్ష రాశాడు. కాగా ఈనెల 30 న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో అతను ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్ అసిస్టెంట్)పోస్టుకు ఎంపికయ్యారు.అట్టి పోస్టుకి 63 మార్కులతో టాపర్ గా నిలిచి సూర్యాపేట జిల్లాలో ఉన్న ఒకే ఒకటి పోస్టుకు నెంబర్ ర్యాంక్ సాధించడంతో ఎంపికయ్యారు. ఆయన తర్వాతి స్థానాల్లో పీఈటి పోస్టుకు 61.5 మార్కులతో మరో ఇద్దరు ఉమ్మడి జిల్లాలో ఎంపికయ్యారు.