కుట్టు శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుంది
కుట్టు శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రధానం చేసిన లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ గండూరి కృపాకర్
కుట్టు శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ గండూరి కృపాకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి అధ్యక్షురాలు బీరవోలు హైమావతి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి ఆధ్వర్యంలో స్థానిక విద్యానగర్లో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి చార్టర్ ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వరి ఆధ్వర్యంలో ఈ కుట్టు శిక్షణ నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం మూడు విడుతలుగా నిర్వహించిన ఈ శిక్షణలో 120మంది మహిళలు శిక్షణ పొందారన్నారు. ఈ శిక్షణకు మహిళలు ఒక్కొక్కరూ రూ 300 చెల్లించాల్సి ఉండేదని కానీ ఆ భారం వారిపై పడకుండా శిక్షకురాలికి రూపు పదివేల వేతనం తన సొంత ఖర్చులతో ఇచ్చినట్లు తెలిపారు. ఈ కుట్టు శిక్షణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడి స్వయం సమృద్ది’ సాధిస్తారన్నారు. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్స్పూర్తి సెక్రటరీ వెన్న కవిత, ట్రెజరర్ ఢాకా విజయలక్ష్మి, లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట సెక్రటరీ వెంపటి శబరి నాద్, మందడి రమాదేవి, కేతిరెడ్డి పద్మ, కొప్పు సందీప్, ముదులగర్ కళ్యాణ్, ఎండి. ఇస్మాయిల్, అనిల్, శిక్షకురాలు రేణుక తదితరులు ఉన్నారు.