జర్నలిస్టుల ఆత్మగౌరవ భవనాలు (ప్రెస్ క్లబ్) నిర్మించాలి
రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
….
సూర్యపేట జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా,నియోజకవర్గ కేంద్రాల్లో యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల ఆత్మగౌరవ భవనాలు,ప్రెస్ క్లబ్ లు నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రైవేటు భవనంలో ఏర్పాటుచేసిన యూనియన్ సమావేశంలో యాదగిరి మాట్లాడారు.రాష్ట్రంలో చాలాచోట్ల జర్నలిస్టులు పక్కా భవనాలు లేక,నిలువ నీడ లేక అద్దె భవనాల్లో పాడుబడిన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రెస్ క్లబ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని ఇది ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే అన్ని యూనియన్లు ఒక్కతాటి మీద నడవాలని అప్పుడే జర్నలిస్టుల అభివృద్ధి సాధ్యపడుతుందని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు కోసం త్వరలోనే అధికారులను అధికార పార్టీ నాయకులను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుస్స చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌసుద్దీన్ రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ రాష్ట్ర సలహాదారులు మానుకొండ రాముసూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటి శ్రీనివాస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కొమ్మ గాని సైదులు గౌడ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశ గాని వెంకట్ గౌడ్ సూర్యాపేట నియోజకవర్గం సలహాదారులు బచ్చలకూరి వెంకన్న సూర్యాపేట నియోజకవర్గం నాయకులు యాతాకుల మధుసూదన్ కుంచం రాంబాబు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు
